Harbhajan: అశ్విన్ తో విభేదాలంటూ ప్రచారం...స్పందించిన హర్భజన్ 1 d ago
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గబ్బా టెస్టు ముగిసిన అనంతరం అతను ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా అశ్విన్‌ను ప్రశంసించాడు. అదేవిధంగా అశ్విన్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంచేశాడు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి ఇలా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నాడు.